Karnataka CM : కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న రాజకీయ లాగుడుపుల మధ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అయితే తన ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని శివకుమార్ స్పష్టం చేశారు.
రిపోర్టర్లతో మాట్లాడిన ఆయన, ఒక వ్యక్తిగత వివాహ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం, అలాగే పార్టీకి సంబంధించిన ఒక ఈవెంట్ ఏర్పాట్లపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. “ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఇందులో రాజకీయ అంశాలేమీ లేవు,” అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను పార్టీ నుంచి అధికారిక పిలుపు వస్తేనే ఢిల్లీకి వెళ్తానని తెలిపారు. “శివకుమార్ వెళ్లొచ్చు. నాకు ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. పిలిచినప్పుడే నేను వెళ్తాను,” అని ఆయన స్పష్టం చేశారు.
Latest News: GVMC: విశాఖలో పెద్ద మార్పు: జీవీఎంసీ సరిహద్దులు విస్తరణ
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండుున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో సీఎం పదవిపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, ఈ రాజకీయ ఊహాగానాల మధ్య శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ ఐక్యతను ప్రదర్శిస్తూ బెంగళూరులో ఒకరికొకరు ఇంట్లలో బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
శివకుమార్ ఢిల్లీకి బయలుదేరిన తర్వాత, సిద్ధరామయ్య మంగళూరులో (Karnataka CM) జరిగిన సామాజిక సంస్కర్త శ్రీ నారాయణగురు–మహాత్మా గాంధీ భేటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ముఖ్య ఉపన్యాసం ఇవ్వడంతో పాటు, సీఎం సిద్ధరామయ్యతో కలిసి భోజనం చేశారు.
పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలని ఆదేశిస్తే, ఆ సమాచారం వేణుగోపాల్ ద్వారానే తమకు అందుతుందని సిద్ధరామయ్య అన్నారు.
ఇదిలా ఉండగా, శివకుమార్ తన ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడిస్తూ, డిసెంబర్ 14న ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరగనున్న ‘వోట్ చోరీ’ (Vote Chori) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చర్చల్లో పాల్గొంటానని తెలిపారు. ప్రతి జిల్లాల నుంచి కనీసం 300 మంది కార్యకర్తలను ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
మంగళూరు విమానాశ్రయంలో కె.సి. వేణుగోపాల్‌కు మద్దతుగా తన అనుచరులు నినాదాలు చేయడంపై ప్రశ్నించగా, శివకుమార్ స్పందిస్తూ “ఓ పదేళ్లుగా ‘డీకే డీకే’ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు. కొందరు ‘మోదీ మోదీ’, ఇంకొందరు ‘డీకే డీకే’, ‘రాహుల్ రాహుల్’, ‘సిద్దు సిద్దు’ అంటారు. ఇది అభిమానమే, దాన్ని సానుకూలంగా తీసుకోవాలి,” అని అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/