📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka CM Post: కర్ణాటక సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

Author Icon By Shobha Rani
Updated: June 30, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక(Karnataka)లో మరోసారి సీఎం (CM)మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీఎం పదవి దక్కుతుందంటూ కొంతకాలంగా ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain)ఇదే విషయాన్ని తెరపైకి తీసుకురావండం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కర్ణాటక సీఎం కూర్చి వార్తల్లో నిలిచింది. మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్‌ కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందంటూ బాంబు పేల్చారు.. అంతేకాకుండా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండటం ఆసక్తిరేపింది. దీంతో కర్నాటకలో మళ్లీ సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.. సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్‌ కు సీఎం బాధ్యతలు అప్పజెబుతారంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి..
“సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు కొనసాగుతారు” :RV దేశ్‌పాండే
కర్ణాటక సీఎం మార్పుపై వార్తల మధ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత సోమవారం కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని దీనిపై అనవసరమైన ప్రచారం వద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్‌వి దేశ్‌పాండే (RV Deshpande) సోమవారం అన్నారు. కర్ణాటక సీఎం మార్పు, నాయకత్వ పునర్నిర్మాణం మధ్య ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి – ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (D.K. Shivakumar) మధ్య ఏర్పడిన విభేదాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని.. అయినా.. వారి మధ్య సఖ్యత ఉందంటూ పేర్కొన్నారు.“అవును, సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్ల పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మార్పు గురించి ఎటువంటి ప్రతిపాదన లేదా చర్చ లేదు.. ఈ అంశం శాసనసభా పక్ష సమావేశంలో ప్రస్తావనకు రాలేదు.. దాని గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. మేమందరం ఐక్యంగా కలిసి బాగా పనిచేస్తున్నాము.” – అంటూ ఆర్‌వి దేశ్‌పాండే పేర్కొన్నారు.
శివకుమార్ – సిద్ధరామయ్య మధ్య సంబంధాలపై స్పష్టత
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే ప్రచారం జరిగింది. తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని శివకుమార్ కూడా బహిరంగంగానే చెబుతున్నారు. లేటెస్ట్‌గా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండటం ఆసక్తిరేపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే

Karnataka CM Post: కర్ణాటక సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

పలుమార్లు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పందించారు. నాయకత్వ మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. దీనిపై తాను బహిరంగంగా ఏమీ మాట్లాడబోనంటూ అప్పట్లో ప్రకటించారు.. తాజా చర్చ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల తర్వాత శాంతింపజేసిన సీఎంపై ఒప్పందం నిజమా?
సిద్ధరామయ్య – శివకుమార్ మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం ఉందని ఊహాగానాలు. శివకుమార్ సీఎం అవుతానని బహిరంగంగానే పలు మార్లు వ్యాఖ్యానించడం. ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలవడం రాజకీయాల్లో ఉద్రిక్తత కలిగిస్తోంది.

Read Also: Jharkhand: జార్ఖండ్‌లో భారీ వర్షాలు –162 మంది విద్యార్థులు

Breaking News in Telugu CM Post Congress DK Shivakumar Congress Leadership Change DK Shivakumar CM News DK Shivakumar News 2025 Google news Google News in Telugu Karnataka CM Change Karnataka CM Latest News Karnataka Congress Politics Karnataka Congress Rift Karnataka Political Crisis Karnataka Political Speculation Latest News in Telugu Paper Telugu News Power Sharing Formula Karnataka RV Deshpande Statement Siddaramaiah Tenure Siddaramaiah vs Shivakumar Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.