Bjp mla corruption news : కర్ణాటకలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గదగ జిల్లా శిరహట్టి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. రహదారి పక్కన గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ ఈ డిమాండ్‌పై లోకాయుక్తను ఆశ్రయించడంతో అధికారులు పన్నాగం పన్ని ఎమ్మెల్యేపై నిఘా పెట్టారు. లక్ష్మేశ్వరపురలోని ఆయనకు చెందిన ఆసుపత్రిలో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఎమ్మెల్యేతో పాటు అతని సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాయక్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్
మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న రోడ్డుకు ఆనుకుని నిర్మించిన గోడకు క్లియరెన్స్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నగదు డిమాండ్ చేస్తూ చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా లోకాయుక్త అధికారులు ఉచ్చుపన్నినట్లు సమాచారం.
దార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురిని అరెస్టు చేసి, అవినీతి నిరోధక చట్టం–1988 కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టు విషయాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు కూడా తెలియజేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, అవినీతిపై ఆరోపణలు చేసే బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేనే లంచం తీసుకుంటూ పట్టుబడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: