📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Karnataka: గాలి జనార్ధన్ రెడ్డి ఇంటిపై దాడి: నిప్పు పెట్టిన దుండగులు

Author Icon By Saritha
Updated: January 24, 2026 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక లో (Karnataka) సంచలన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి (Gali Janardhan Reddy) చెందిన ఒక భవనానికి దుండుగులు నిప్పు పెట్టారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే గాలి జనార్ధన్ రెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

జనవరి 1వ తేదీన ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే, ఇప్పుడు ఆయన ఆస్తికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. ఈ సంఘటన బళ్లారి నగరంలోని ‘జీ స్క్వేర్ లేఅవుట్’లో వెలుగుచూసింది. ఇక్కడ గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఒక ‘మోడల్ హౌస్’ ఉంది. ఇది సుమారు 109 ఎకరాల నివాస స్థలంలో ఉంది. ఈ స్థలం గాలి జనార్ధన్ రెడ్డి మరియు శ్రీరాములు పేర్లపై రిజిస్టర్ అయి ఉంది. సుమారు 13-14 ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ మోడల్ హౌస్‌ను నిర్మించారు.

Read Also: Hyderabad: ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే..

ఘటనపై ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రస్తుతం దీని విలువ రూ. 3 కోట్లకు పైగానే ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో దుండుగులు దీనికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. (Karnataka) గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి మాట్లాడుతూ.. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇది కావాలనే చేసిన పని అని, దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. బ్యానర్ల గొడవ జరిగిన కొద్ది వారాలకే ఈ అగ్నిప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడానని, బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. బళ్లారిలో కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని ఈ సంఘటన మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



arson attack Ballari News Bellary Politics BJP MLA fire incident Gali Janardhan Reddy Karnataka politics Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.