కర్ణాటకలో కదులుతున్న బస్సులో ఒక యువతి తనకు ఎదురైన (harassment) లైంగిక వేధింపులపై ధైర్యంగా స్పందించిన ఘటన వెలుగులోకి వచ్చింది. (Karnataka) వేధింపుకు పాల్పడిన యువకుడిని ఆమె అక్కడికక్కడే నిలిపి, ఆ సంఘటనను వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో యువతి ధైర్యానికి ప్రశంసలు వస్తున్నాయి. ఆమె వీడియోను పోలీసులకు ట్యాగ్ చేయడంతో అంకోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం.ఎన్. దీపన్ తెలిపారు.
నేను అంకోలాకు ప్రయాణిస్తున్నాను. మా సోదరుడు కూడా నాతో ఉన్నాడు. అతనికి కిటికీ పక్క సీటు కావాలనిపించడంతో అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. అది మూడు సీట్ల వరుస కావడంతో నా పక్కన సీటు ఖాళీగా ఉంది. ఇంతలో దాదాపు 28 ఏళ్ల యువకుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు అని ఆమె వివరించింది. ప్రభుత్వ బస్సు కావడంతో నేను అతడిని వేరే చోట కూర్చోమని చెప్పలేకపోయాను. నేను నిద్రపోయిన సమయం లో ఆ యువకుడి చేయి నా ఛాతీపై ఉంది. ఒక్కసారిగా షాక్‌కు గురై, వణికిపోయాను. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని, బస్సుల్లోకి ఇలాంటి పనుల కోసమే వస్తారా? అని గట్టిగా మందలించాను. అయినా అతను కదలకుండా నా పక్కనే కూర్చున్నాడు. నేను మరోసారి గట్టిగా అరిచి, అతడిని సీటులోంచి పక్కకు తోసేశాను అని ఆమె పేర్కొంది.
Read also: Jahan Mazdani: న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం
యువకుడిని అడ్డుకుని నిలదీసిన వైనం
అతడిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. బస్సు ఆగగానే, అతను ముఖానికి అడ్డుపెట్టుకుని దిగిపోయేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే వీడియో తీయడం మొదలుపెట్టి, అతని తలపై ఒకటి కొట్టాను. ఆ సమయంలో అతను ఏమీ చేయలేదని బుకాయించడం మొదలుపెట్టాడు. ఈ వీడియో అతని కుటుంబ సభ్యులకు చేరాలని నేను కోరుకుంటున్నాను. అతని తండ్రి, సోదరీమణులకు ఈ నీచమైన పని గురించి తెలియాలి అని ఆమె వీడియోలో స్పష్టం చేసింది.
వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని మహిళలకు
ఈ సందర్భంగా మహిళలు, యువతులకు ఆమె ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది. మీతో ఎవరైనా అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండకండి. మీకు ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీ కోసం మీరు నిలబడాలి. (Karnataka) గట్టిగా అరిచి సహాయం కోరండి. వారి నీచమైన పనులు బయటపడేలా చూడండి. ఏ కారణంతోనూ మౌనంగా ఉండొద్దు అని ఆమె విజ్ఞప్తి చేసింది. వారి సొంత కుటుంబ సభ్యులు ఇలాంటి బాధను అనుభవిస్తేనే వీరికి ఆ నొప్పి తెలుస్తుంది. కానీ ఇతరుల విషయంలో మాత్రం ఇలా చేయడానికి ఆనందిస్తారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బస్సు దిగిపోతున్నప్పుడు బ్యాగుతో ముఖం కప్పుకోవడానికి ప్రయత్నించిన నిందితుడితో, కెమెరా వైపు ముఖం చూపించు అని ఆమె గట్టిగా నిలదీయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: