📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Karnataka: సిగరెట్ లైటర్ కోసం వివాదం.. కారుతో ఢీకొట్టి చంపిన యువకుడు

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని (Karnataka) కోలార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన చిన్న వివాదం ముదిరి ఓ యువకుడి ప్రాణం తీసింది. కారుతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన యువకుడు ఆసుపత్రికి (Hospital) తరలిస్తుండగా చనిపోగా.. అంతకుముందు జరిగిన గొడవలో నాలుక తెగడంతో నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read Also: Weather Update: దక్షిణ భారత్‌కు వర్ష సూచన

మాటామాటా పెరగడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో పరస్పరం దాడి

కోలార్ జిల్లా కమ్మసంద్రలో (Karnataka) జరుగుతున్న క్రికెట్ పోటీలకు ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే కారులో వెళ్లారు. మ్యాచ్ అయిపోయాక స్నేహితులు ఇద్దరూ సరదాగా పార్టీ చేసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత సిగరెట్ లైటర్ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రోషన్ నాలుక తెగిపోవడంతో కారులో ఆసుపత్రికి బయలుదేరాడు. రోషన్ ను ఆపడానికి ప్రయత్నించిన ప్రశాంత్.. కారు డోర్ పట్టుకుని వేలాడాడు. రోషన్ కారును ఆపకుండా వేగంగా నడిపి ప్రశాంత్‌ను ఈడ్చుకెళ్లి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితుడు రోషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Dashcam Video drunk driving Friendship Turned Tragic Kolar Crime Latest News in Telugu Road Rage Incident Telugu News Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.