📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news :Kangana Ranaut – కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు

Author Icon By Sudha
Updated: September 12, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కు సుప్రీంకోర్టు (Supreme Court) చురకలు వేసింది. తనపై నమోదైన క్రిమినల్‌ డిఫమేషన్‌ కంప్లయింట్‌ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.కంగనా తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దాంతో కంగనా రనౌత్‌ (Kangana Ranaut) సుప్రీంకోర్టులో దాఖలుచేసిన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్‌ కౌర్‌ అనే వృద్ధ మహిళను కించపర్చేలా రీట్వీట్‌ చేశారు. ఆమె రూ.100 కిరాయికి వస్తుందని తన రీట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో మహిందర్‌ కౌర్‌ పరువునష్టం కేసు వేశారు.

Kangana Ranaut – కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు

దాంతో కౌర్‌ (Kangana Ranaut) ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమెకు చీవాట్లు పెట్టింది. ‘మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి..? మీది సింపుల్‌ రీట్వీట్ కాదు. మీరు మీ సొంత కామెంట్స్‌ చేశారు. మసాలా జోడించారు’ అని జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దాంతో తన క్లయింట్‌ ఆ రీట్వీట్‌పై క్లారిఫికేషన్‌ ఇచ్చారని కంగనా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ క్లారిఫికేషన్‌ ట్రయల్‌ కోర్టుకు ఇవ్వండని ధర్మాసనం సూచించింది. కంగనా పంజాబ్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయవాది చెప్పగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరవచ్చని కోర్టు పేర్కొంది. న్యాయవాది మరేదో వాదన చేయబోతుండగా.. ‘ఆమె ట్వీట్‌పై మా స్పందన కోరే ప్రయత్నం చేయకండి’ అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.

కంగనా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఆప్ కి అదాలత్ తాజా ఎపిసోడ్‌లో, నటి మరియు బిజెపి ఎంపి తన చుట్టూ ఉన్న ప్రతికూల ప్రచారం కారణంగా తాను వివాహం చేసుకోలేకపోతున్నానని మాట్లాడారు.

కంగనా రనౌత్ పర్సనల్ లైఫ్?

కంగన 1987 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని మనాలి సమీపంలోని భంబ్లాలో జన్మించింది. ఆమె తండ్రి అమర్‌దీప్ ఒక వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి ఆశా ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు మరియు ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె తాత ఒక IAS అధికారి .

కంగనా రనౌత్ రిచ్?

91 కోట్లు. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు ఎంపీ కంగనా రనౌత్ నటన మరియు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా గణనీయమైన సంపదను సంపాదించారు. అయితే, ఆమె ఆదాయం 2022-23లో మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ₹4.12 కోట్లకు తగ్గింది. ఆమెకు ఒక నిర్మాణ సంస్థ కూడా ఉంది మరియు బంగారం, వెండి మరియు వజ్రాలు వంటి విలువైన ఆస్తులు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bomb-delhi-high-court-receives-bomb-threats/national/545973/

Bollywood Controversy Breaking News Indian Judiciary Kangana Ranaut latest news Legal News Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.