📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Telugu News: Kanchi Temple: కాంచీపురం దేవాలయంలో బల్లుల తాపడాలు మార్చిడం పై కలకలం

Author Icon By Tejaswini Y
Updated: November 6, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం(Kanchi Temple) ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వివాదానికి కేంద్రంగా మారింది. అక్కడి ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ఉన్న బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చేసారని వచ్చిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో పురాతన తాపడాలను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చారని శ్రీరంగానికి చెందిన భక్తుడు రంగరాజ నరసింహ ఆరోపించారు. దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా, ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని అధికారులు సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఆమెతో పాటు ఆలయ సిబ్బందిని కూడా విచారించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం, అవసరమైతే తిరిగి విచారణకు హాజరుకావాలని ఈవో మరియు సిబ్బందికి సూచనలు జారీ చేశారు. 108 దివ్యదేశాల్లో ఒకటైన కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉంది. అక్కడి బంగారు, వెండి బల్లుల విగ్రహాలు భక్తులకు అత్యంత పవిత్రమైనవి. వాటిని తాకితే సకల దోషాలు నివారమవుతాయని విశ్వాసం. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

Read Also: Nellore Accident: బాబోయ్! రోడ్డు ప్రమాదాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

Kanchi Temple: పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి శాపం వల్ల ఆయన ఇద్దరు శిష్యులు బల్లులుగా మారిపోయారు. వారు కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో భక్తితో ప్రార్థించగా, స్వామి వారి శాపాన్ని తొలగించి విముక్తి ప్రసాదించాడు. ఆ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యులుగా నిలిచి, వారిద్దరి ప్రతిరూపాలు బంగారం (సూర్యుడు) మరియు వెండి (చంద్రుడు) రూపాల్లో ఆలయంలో స్థాపించబడ్డాయి. అప్పటి నుంచి ఈ బల్లులను తాకినవారికి దోష నివారణ జరుగుతుందని నమ్మకం ఏర్పడింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

GoldenSilverLizards KanchiControversy KanchipuramTemple KanchipuramUpdates SouthIndiaTemples TamilNaduNews Telugu News Today TempleInvestigation TempleTradition VaradarajaPerumalTemple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.