📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Annamalai: రాజ్యసభ సీటు తో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

Author Icon By Aanusha
Updated: October 7, 2025 • 7:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌ (Kamal Haasan) పై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజునుంచే ప్రజల కోసం, మార్పు కోసం పనిచేస్తానని చెప్పినా, చివరికి ఆయన స్వార్థ రాజకీయాల్లో మునిగిపోయారని అన్నామలై మండిపడ్డారు.

Crime: ప్రియురాలిని హతమార్చి ..ఆపై సమాధిపైనే నిద్ర

“ఒకే ఒక్క రాజ్యసభ (Rajya Sabha) సీటు కోసం కమల్ తన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నాడు. ప్రజలు ఆయనను ఒక ఆలోచనాపరుడిగా గౌరవించారు. కానీ ఇప్పుడు ఆయన అధికార డీఎంకే పార్టీకి మద్దతుగా నిలబడటం, తన విలువలను తానే తుడిచిపెట్టుకోవడమే” అని అన్నారు.

కరూర్ తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.గత నెల 27న కరూర్ పట్టణంలో నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Annamalai

డీఎంకే (DMK) నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు

ఈ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటన అనంతరం కమల్ హాసన్ స్థానిక డీఎంకే (DMK) నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ, ప్రభుత్వ వైఫల్యం కాదని అన్నారు.

పోలీసులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని, ముఖ్యమంత్రి కూడా గౌరవంగా వ్యవహరించారని కితాబిచ్చారు.కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా స్పందించారు. “ఒక రాజ్యసభ సీటు కోసం కమల్ ఎప్పుడో తన అంతరాత్మను అమ్ముకున్నారు.

కరూర్ (Karur) బాధితులను పరామర్శించడానికి వెళ్లి, ప్రభుత్వ తప్పులేదని సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? ఆయన ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముంది?” అని అన్నామలై (Annamalai) ప్రశ్నించారు. అసలు కమల్ మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. కమల్ పూర్తిగా డీఎంకేకు అనుకూలంగా మారిపోయారని అన్నామలై విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Annamalai Kamal Haasan latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.