ప్రసిద్ధ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో (At the party meeting) తీవ్ర అసహనానికి లోనయ్యారు. సభ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలో ఓ అభిమాని ఊహించని తంతును సృష్టించాడు. అతని ప్రవర్తనతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.సభలో కమల్ హాసన్‌కు కొందరు అభిమానులు పెద్ద కత్తిని బహూకరించారు. ఆ సందర్భంలో కమల్ నవ్వుతూ ఆ బహుమతిని స్వీకరించి ఫోటోలకు పోజులిచ్చారు. అంతవరకూ అన్నీ సజావుగా సాగుతున్నాయి. కానీ ఆ తరువాత జరిగిన ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసింది.
బలవంతంగా కత్తి ఇచ్చేందుకు ప్రయత్నించిన కార్యకర్త
ఒక కార్యకర్త వేదికపైకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తి కమల్ చేతికి బలవంతంగా కత్తిని అందించేందుకు యత్నించాడు. ఈ చర్యతో కమల్ హాసన్ ఒక్కసారిగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ముఖంలో నవ్వు మాయమై అసహనం స్పష్టంగా వ్యక్తమైంది.
పోలీసుల జోక్యం – కార్యకర్తను పక్కకు తీసుకెళ్లారు
ఈ ఘటన తర్వాత అక్కడే ఉన్న పోలీసు అధికారి వెంటనే స్పందించారు. ఆ కార్యకర్తను అడ్డగించారు. అతడి చేతిలో ఉన్న కత్తిని పక్కకు పెట్టించారు. అయినా, అతను కమల్‌ను కలుసుకునేందుకు, ఫోటో తీసుకోడానికి పట్టుబడటం కొనసాగించాడు. భద్రతా సిబ్బంది చివరికి అతన్ని సభాస్థలం నుండి దూరం చేశారు.ఈ క్రమంలో సభా వాతావరణం కాసేపు ఉద్విగ్నంగా మారింది. అయితే కమల్ హాసన్ త్వరలోనే తన భావోద్వేగాలను నియంత్రించుకుని సభను కొనసాగించారు.
Read Also : Salman Khan : విడాకులు, భరణంపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు