📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Kamal Haasan: కమల్‌కు అభిమాని ఊహించని బహుమతి

Author Icon By Shobha Rani
Updated: June 16, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MIM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌(Kamal Haasan)కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో వేదికపైనే సొంత పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త వేదికపైకి వచ్చి కమల్‌(Kamal Haasan)కు కత్తిని బహుకరించాడు. అనంతరం ఆ కత్తిని చేతితో పట్టుకుని పైకెత్తాలంటూ, ఆయన చేతికి ఇచ్చేందుకు ఒత్తిడి చేశాడు. తొలుత కూల్‌గా నిరాకరించిన కమల్‌.. కార్యకర్త ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయారు. ఈ అనూహ్య పరిణామంతో వేదికపై గందరగోళం నెలకొంది. అనంతరం అదే వేదికపై ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని సదరు వ్యక్తులను బలవంతంగా వేదిక మీద నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..
మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీ సమావేశం
చెన్నైలో మక్కల్‌ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) విచ్చేశారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్‌ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెన్నైలో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.

గిఫ్ట్‌గా కత్తి..?
బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగతున్న సమయంలో వేదికపైగా కొందరు కార్యకర్తలు చేరుకుని ఆయనకు ఓ భారీ కత్తిని బహూకరించారు. మొదట నవ్వుతూనే కత్తిని కమల్‌ స్వీకరించారు. అనంతరం వారు కత్తిని చేతితో పట్టుకోవాలని ఒత్తిడి చేశారు. తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించిన కమల్(Kamal Haasan).. మరో కార్యకర్త కత్తిని ఒరలో నుంచి తీసి కమల్‌ చేతికి బలవంతంగా అందించబోయాడు.

Kamal Haasan: కమల్‌కు అభిమాని ఊహించని బహుమతి

దీంతో సహనం కోల్పోయిన కమల్‌.. కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కమల్‌ హాసన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి చూపగా.. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తను నిలువరించి, వేదికపై నుంచి కిందకి దింపేశారు.
కమల్‌ ఆగ్రహం – వేదికపై గందరగోళం
కొద్ది నిమిషాల పాటు వేదికపై గందరగోళం నెలకొన్నప్పటికీ అనంతరం మళ్లీ యథాస్థితికి చేరుకుని, నిర్వహకులను కార్యక్రమం కొనసాగించమని కమల్‌ (Kamal Haasan) నవ్వుతూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కమల్‌కు కత్తిని బహుకరిస్తే ఎందుకు కోపం వచ్చిందో? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మనం కత్తి కాదు మన చేతిలో పుస్తకం, పెన్ను పట్టుకోవాలి. కమల్‌ ఇతరుల మాదిరిగా కత్తిని ఎత్తి ఫోటోలకు ఫోజులు ఇవ్వవచ్చు. ఆయన అలా చేయలేదు. ఆయన మంచి రాజకీయ నాయకుడు అంటే మరో నెటిజన్ కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నాడు.
సంఘటనపై విశ్లేషణ
కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినీ జీవితంలో వివిధ హింసాత్మక పాత్రలు చేసినా, వాస్తవ జీవితం మాత్రం విలక్షణంగా ఉంది. వివేచన, బాధ్యతతో వ్యవహరించిన నేతగా అభినందనలు. MNM పార్టీకి ఇది కొత్త భద్రతా దృష్టాంతంగా నిలవవచ్చు. ఈ సంఘటన కమల్‌ హాసన్‌ (Kamal Haasan) వ్యక్తిత్వాన్ని, ప్రజాప్రతినిధిగా ఉన్న నైతికతను బలంగా బయటపెట్టింది. హింసాపూరిత ప్రదర్శనకు వ్యతిరేకంగా స్పందించిన కమల్‌ తీరుపై అభిమానులు, నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలకు ఇది ఒక గుణపాఠంగా మారవచ్చు.

Read Also: Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు

an unexpected gift from a fan Breaking News in Telugu Google news Google News in Telugu Kamal gets Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.