📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Kaleswaram: ముగ్గురు ఇంజినీర్లపై విజిలెన్స్ కొరడా

Author Icon By Saritha
Updated: October 16, 2025 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.400 కోట్ల విలువైన ఆస్తులపై నిషేధం

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ముగ్గురు కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు ఇంజినీర్లపై విజిలెన్స్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. వీరికి చెందిన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ ఆస్తుల విలువ మార్కెట్‌లో దాదాపు రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కోర్టులో కేసు తేలేంతవరకు ఈ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని అధికారుల ఆదేశాలు వచ్చాయి. ఏసీబీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు.

Read also: స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..

భూక్యా హరిరాం, నూనె శ్రీధర్, చీటి మురళీధర్‌పై కేసులు

ఏసీబీ దాడుల్లో బయటపడిన వివరాల ప్రకారం, గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరాం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్, మరియు మాజీ చీఫ్ ఇంజినీర్ చీటి మురళీధర్ పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని తేలింది. హరిరాం 2025 మేలో అరెస్టయ్యారు, ఆ సమయంలో ఆయన కాళేశ్వరం (Kaleswaram)ఇరిగేషన్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. శ్రీధర్ కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో కలిసి దాదాపు రూ.110 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చీటి మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు దాటిందని అంచనా.

ఏసీబీ లేఖతో విజిలెన్స్ కదిలింది

ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలతో విజిలెన్స్ కమిషన్ సత్వర చర్యలు తీసుకుంది. ఏసీబీ డైరెక్టర్ పంపిన లేఖ ఆధారంగా ఈ ముగ్గురి ఆస్తులను అధికారికంగా అటాచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆస్తులపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా విజిలెన్స్ శాఖ పర్యవేక్షణలో ఉంచబడింది. ఈ కేసులు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని సాక్ష్యాలు సేకరిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu irrigation department telangana kaleshwaram project Latest News in Telugu Telangana corruption

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.