📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kakinada: రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Kakinada: Husband brutally beats wife for not agreeing to second marriage

Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య అని చూడకుండా, సమాజంలో గౌరవప్రదమైన కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మహిళపై భర్త నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదన్న కోపంతో నడిరోడ్డుపై ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. 

Read Also: Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు

సామర్లకోట మండలం పీ. వేమవరానికి చెందిన మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే, తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా రెండో పెళ్లి విషయంపై మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన మణికంఠ, భార్య దేవిని రోడ్డుపై కిందపడేసి దారుణంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన ఆమె, తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Excise constable Devi attack Husband beats wife Kakinada crime Second marriage dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.