ఏపీలో(Kadapa) వాలంటైన్స్ డే రోజే విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ప్రేమ జంటను లారీ ఢీకొనడంతో స్పాట్‌లోనే యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
(Kadapa) వాలంటైన్స్ డే (Valentine’s Day) సందర్భంగా విహారయాత్రకు బయలుదేరిన మూడు ప్రేమ జంటలు బైక్‌లపై జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ గండికోటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ లారీ ఒక జంట ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో యువతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. తిరుపతి నుంచి గండికోటకు వెళ్తుండగా ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Noida: MRI కి ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: