సిపిఐ జాతీయ నేత నారాయణ
హైదరాబాద్ : (K. Narayana) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ(BJP) నేతలు జాతి పిత మహాత్మాగాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగిస్తున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ విమర్శించారు. అహింస, లౌకికత్వం, సామాజిక న్యాయం వంటి గాంధీయ విలువలను బలహీనపరుస్తూ, స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండి, ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన శక్తులు నేడు తమకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తూ తిరగరాయడం దురదృష్టకరమని, (K. Narayana) ఇది భారతదేశ ప్రతిష్టకు అవమానకరమన్నారు. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందెవరు? నేడు అనాలోచితంగా కీర్తించబడుతున్నదెవరని ప్రశ్నించారు.
Read also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి
సంక్షేమ పథకాల నుంచి గాంధీ తొలగింపు పై విమర్శ
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అది కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన దశాబ్దాల త్యాగపోరాట ఫలితం. ఈ పోరాటానికి నాయకత్వం వహించినవారు జాతిపిత మహాత్మా గాంధీ. కానీ కొందరు చెబుతున్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న జన్మించారు. (K. Narayana)స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమేనని, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఏ ప్రధాన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు. అయినప్పటికీ నేడు దేశమంతటా వాజ్ పేయి విగ్రహాలు ఏర్పాటు చేయటం, రహదారులు, చూస్తున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకులుగా చలామణి అయిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి దాపురించిందన్నారు.
అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్రం ఎవరు దానం చేయలేదని, అనేక ప్రాణత్యాగాలతో సాధించ బడిందన్నారు. (K. Narayana) పలు సంస్థలు, ప్రజా స్థలాలు, పథకాల పేర్లలో మార్పులు చేయడం వంటి చర్యలను మనం ప్రస్తుత రాజకీయ భావజాలాలకు అనుగుణంగా గత చరిత్రను మార్చాలనుకోవటం అవివేకమన్నారు. మహాత్మ గాంధీని కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం చేసి, ఆయన ఆలోచనలను ఆచరణలో లేకుండా చూడాలన్నదే నేటి పాలకుల అనాలోచిత విధానంగా గోచరిస్తుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: