📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Union Minister: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ

Author Icon By Sudha
Updated: June 18, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర సమాచార, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం(John Abraham) , నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ CEO మందార్ తమ్హానే(Mandar Tamhane)ను కలిశారు.

Union Minister: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ

ఈ సందర్భంగా మందార్ తమ్హానే జ్యోతిరాదిత్య సింధియాకు కొత్త జెర్సీని అందజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ట్వీట్ చేశారు.

క్రీడా శక్తి
భారతదేశంలో క్రీడా శక్తి వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. భారత ఫుట్‌బాల్‌ క్రీడను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కేంద్ర సమాచార, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి బుధవారం బాలీవుడ్ సినీ నటుడు జాన్ అబ్రహం, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ CEO మందార్ తమ్హానేను కలిశారు. ఈ సందర్భంగా మందార్ తమ్హానే జ్యోతిరాదిత్య సింధియాకు కొత్త జెర్సీని అందజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ట్వీట్ చేశారు. జాన్ అబ్రహం, మందార్ తమ్హానేను కలవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.జాన్ అబ్రహం, మందార్ తమ్హానే, జ్యోతిరాదిత్య సింధియా మధ్య ఫుట్‌బాల్ అభివృద్ధిపై చర్చలు జరిగాయి.
ఆయన కల నిజంగా స్ఫూర్తిదాయకం
‘‘క్రీడల పట్ల లోతైన అభిరుచిని, యువ ప్రతిభను గుర్తించి, శిక్షణతో తీర్చిదిద్ది, మద్దతు ఇచ్చే తపనను పంచుకునే వ్యక్తితో కనెక్ట్ అవ్వడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.. ముఖ్యంగా భారతదేశ క్రీడా శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈశాన్య ప్రాంతంలో వారి సహకారం ఎంతో తోడ్పాటునందిస్తుంది. ఫుట్‌బాల్ పట్ల జాన్‌కు ఉన్న అజేయమైన ఉత్సాహం.. మన నేల నుంచి మెస్సీ లేదా రొనాల్డో ఎదగడాన్ని చూడాలనే ఆయన కల నిజంగా స్ఫూర్తిదాయకం.. భారత ఫుట్‌బాల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో అతని కల ఫలించాలని.. వారి జట్టుకు గొప్ప విజయాలను అందించాలని కోరుకుంటున్నాను’’.. అంటూ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. “జాన్ అబ్రహం, మందార్ తమ్హానే, నార్త్ ఈస్ట్ యునైటెడ్ FCతో కలిసి ఈ సమావేశం జరిగింది. మందార్ తమ్హానే జెర్సీని అందజేయడం ద్వారా, ఈశాన్య ప్రాంత ఫుట్‌బాల్ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందనలు.” అని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా, ఈశాన్య ప్రాంత ఫుట్‌బాల్ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పం వ్యక్తమైంది. ఫుట్‌బాల్ అభివృద్ధి, ఈశాన్య ప్రాంత ప్రోత్సాహం, మరియు సినీ ప్రముఖుల పాత్రపై దృష్టి సారించడంలో కీలకమైనది.

Read Also:India Canada: దౌత్యవేత్తల పునర్‌ నియామకానికి భారత్, కెనడా గ్రీన్

#FootballDevelopment #JohnAbraham #JyotiradityaScindia #MandarTamhanne #NorthEastUnitedFC Bollywood Actor Breaking News in Telugu Google news Google News in Telugu John Abraham Jyotiraditya Scindia meets Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.