📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు

Author Icon By Sudheer
Updated: May 19, 2025 • 8:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ (Pakistan)కు గూఢచర్యం చేసిన ఆరోపణల నేపథ్యంలో హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) అరెస్టయిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ తనకు దేశ విదేశాల్లోని అనేక ప్రాంతాల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న జ్యోతి, నిజంగా ఒక గూఢచారి లా వ్యవహరించిందని పోలీసుల అనుమానాలు బలంగా ఉన్నాయి. విచారణలో ఆమెపై పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆమె పోస్ట్ చేసిన వీడియోలో పాకిస్థాన్‌ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.

ఆమె ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు

పోలీసుల దర్యాప్తులో జ్యోతి పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేయడమేగాక, అక్కడి అధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు పొందిందని, ఇది ఒక సైబర్ వార్ తరహాలో దేశ భద్రతను దెబ్బతీయడమేనని తేలింది. ఆమె ముఖంలో పశ్చాత్తాపం లేదని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారితో తను సన్నిహితంగా టచ్‌లో ఉండిందని, అతడు ఆమెను ట్రాప్ చేసి తమ పనులకు వాడుకున్నారని సమాచారం. చైనా, పాకిస్థాన్ పర్యటనలు కూడా ఈ గూఢచర్య వ్యవహారానికి కీలకంగా మారాయి.

పహల్గామ్ ఘటనకు కొన్ని రోజులు ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు

పహల్గామ్ ఘటనకు కొన్ని రోజులు ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు తీసిన జ్యోతి, వాటిని పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. దేశ భద్రతకు ముప్పుగా మారే సైబర్ చర్యలను ఎదుర్కోవడానికి పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : Tirumala : తిరుమల శ్రీవారికి సేవ చేసేందుకు 17 ఏళ్ల పోరాటం చేసిన భక్తుడు : ఏమైందంటే

Google News in Telugu Jyoti Malhotra Jyoti Malhotra arrest Sensational things

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.