📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Justice Yashwant Varma: జ‌డ్జీల క‌మిటీ నివేదిక‌ను స‌వాల్ చేసిన జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ

Author Icon By Sudha
Updated: July 18, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంట్లో క్యాష్ దొరికిన కేసులో.. జ‌డ్జీల క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను స‌వాల్ చేస్తూ (Challenging the report)అల‌హాబాద్ హైకోర్టు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ (Justice Yashwant Varma)ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ద‌ర్యాప్తు చేప‌ట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇన్‌హౌజ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ఆయ‌న స‌వాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జ‌డ్జిగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో మార్చి 14వ తేదీన అత‌ని ఇంటిలో భారీగా నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డిన‌ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పంజాబ్‌, హ‌ర్యా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ శీల్ నాగు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జీఎస్ సంధ‌వాలియా, క‌ర్నాట‌క హైకోర్టు జ‌స్టిస్ అను శివ‌రామ‌న్‌తో కూడిన క‌మిటీ ఓ నివేదిక‌ను మే 4వ తేదీన రిలీజ్ చేసింది.

Justice Yashwant Varma: జ‌డ్జీల క‌మిటీ నివేదిక‌ను స‌వాల్ చేసిన జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ

రాజ్యాంగ వ్య‌తిరేకం

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ (Justice Yashwant Varma)ఇంటి స్టోర్‌రూమ్‌లో క్యాష్ ఉన్న‌ట్లు ఆ క‌మిటీ పేర్కొన్న‌ది. ఆ రిపోర్టు ఆధారంగా వ‌ర్మ‌ను తొల‌గించాల‌ని అప్ప‌టి సీజేఐ సంజీవ్ ఖ‌న్నా మే 8వ తేదీన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిని కోరారు. త‌న‌ను తొల‌గించాల‌ని జ‌స్టిస్ ఖ‌న్నా చేసిన ప్ర‌తిపాద‌న రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని జ‌స్టిస్ వ‌ర్మ త‌న పిటీష‌న్‌లో తెలిపారు. జ‌డ్జీల‌పై జ‌రిగిన ఇన్‌హౌజ్ ద‌ర్యాప్తు తీరును జ‌స్టిస్ వ‌ర్మ ప్ర‌శ్నించారు. స‌మాంత‌ర రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను క్రియేట్ చేసి విచార‌ణ సాగించిన‌ట్లు జ‌స్టిస్ వ‌ర్మ ఆరోపించారు. 1968 జ‌డ్జీల ర‌క్ష‌ణ చ‌ట్టం ప్ర‌కారం ఇన్‌హౌజ్ ద‌ర్యాప్తు జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అధికారిక ఫిర్యాదు లేకుండానే విచార‌ణ చేప‌ట్ట‌డం అక్ర‌మ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే త‌నపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు చెప్పారు. జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ (Justice Yashwant Varma) ఇంట్లో మార్చి 14వ తేదీ రాత్రి 11.35 నిమిషాల‌కు అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అప్పుడు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు జ‌డ్జీగా ఉన్నారు. ఆయ‌న స్టోర్‌రూమ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదాన్ని ఆర్పేందుకు ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు చేరుకున్నాయి. 15 నిమిషాల్లోనే ఆ మంట‌ల్ని ఆర్పేశారు. అయితే ఆ స్టోర్‌రూమ్ నుంచి గుర్తు తెలియ‌ని న‌గ‌దును రిక‌వ‌రీ చేశారు. మంటల్లో కాలిపోతున్న నోట్ల క‌ట్ట‌ల‌కు చెందిన ఓ వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి . ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జ‌స్టిస్ వ‌ర్మ‌ను అలహాబాద్ హైకోర్టుకు బ‌దిలీ చేశారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ నేపథ్యం?

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (ఆనర్స్) డిగ్రీని పొందారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని అవధేష్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ లాస్ (LLB) డిగ్రీని పొందారు.

యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తినా?

2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 01న ఆ కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయబడి, ఏప్రిల్ 5, 2025న ప్రమాణ స్వీకారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

#telugu News Breaking News Court News Indian Judiciary Judges Committee Report Justice Yashwant Varma Latest News Breaking News "Telugu News Legal Challenge

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.