हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Justice Surya Kant: సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌

Sushmitha
Telugu News: Justice Surya Kant: సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు (తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా) హాజరయ్యారు. ప్రత్యేకించి, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి న్యాయమూర్తులు కూడా అటెండ్‌ అవ్వడం విశేషం.

Read Also: Rain alert: తమిళనాడులో భారీ వర్షాలు విద్యసంస్థలకు సెలవు

Justice Surya Kant
Justice Surya Kant Justice Surya Kant sworn in as CJI of Supreme Court

ఎవరు ఈ జస్టిస్ సూర్యకాంత్?

జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు.

  • వ్యక్తిగత వివరాలు: హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్ ఆయన స్వస్థలం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, న్యాయవాద వృత్తిలో అంచలంచెలుగా ఎదిగారు. అతిచిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.
  • న్యాయ వృత్తి: పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో అనేక కీలక కేసులను డీల్ చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సూర్యకాంత్, 2024 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • పదవీ కాలం: ఆయన 2027 ఫిబ్రవరి వరకు దాదాపు 15 నెలలపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

కీలక తీర్పులు, ప్రాధాన్యతలు

జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు.

  • ముఖ్యమైన కేసులు: ఆర్టికల్ 370 రద్దు, దేశద్రోహ చట్టం నిలిపివేత వంటి కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
  • మహిళల ప్రాతినిధ్యం: సుప్రీంతో పాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించారు.
  • ఒన్ ర్యాంక్, వన్ పెన్షన్: వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకాన్ని సమర్థిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందంటూ తీర్పునిచ్చారు.
  • ప్రాధాన్యత: పెండింగ్‌ కేసులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యత అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పెండింగ్‌ కేసులను క్లియర్ చేసేందుకు సరైన మెకానిజాన్ని ప్రవేశపెడతామన్నారు.

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

జస్టిస్ సూర్యకాంత్.

జస్టిస్ సూర్యకాంత్ స్వస్థలం ఏది?

హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870