📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Justice Gavai: వీధి కుక్కలపై ఉత్తర్వులను పరిశీలిస్తాం: జస్టిస్ గవాయ్

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను తాను పరిశీలిస్తానన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్(Justice Gavai) వెల్లడించారు. దిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, పలువురు నుంచి వినతులు వచ్చాయి. సుప్రీంకోర్టు(Suprem Court) పున:పరిశీలించాలని సీజేఐకి విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఉత్తర్వులను పరిశీలిస్తానని పేర్కొన్నారు. అయితే వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ (Delhi)ఎన్సీఆర్‌ల పరిధిలో రేబిస్‌ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను ఇటీవల పరిగణనలోకి తీసుకుంది జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం. విచారణ చేపట్టి ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది.

వీధి కుక్కలపై ఉత్తర్వులను పరిశీలిస్తాం: జస్టిస్ గవాయ్

కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటాం

ఆ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని తెలిపింది. ఆ సమంయలో తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి.

రూ.15 వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో దిల్లీ ప్రభుత్వం ఉందా?

సుప్రీంకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ. ఆర్థిక నష్టాలతో పాటు జీవవైవిధ్యం దెబ్బతింటుందని తెలిపారు. దిల్లీలో ఉన్న 3 లక్షల వీధికుక్కల కోసం 3 వేల షెల్టర్లు కావాలని, వీటి ఏర్పాటుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో దిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు, దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ, సైన్స్‌ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీనటుడు అడివి శేష్‌ సీజేఐకి లేఖ రాశారు. జాన్‌ అబ్రహాం, జాన్వీ కపూర్, వరుణ్‌ ధావన్, సిద్ధార్థ్‌ ఆనంద్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర్వులను పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు.

2025లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
భూషణ్ గవై
ప్రధాన న్యాయమూర్తి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ మరియు పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ లకు వాస్తవ ఛాన్సలర్. 52వ మరియు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ గవై. మే 14, 2025న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఈ పదవిని నిర్వహించిన మొదటి బౌద్ధుడు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం ఎంత?
భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం ఎంత? ఉద్యోగ ప్రొఫైల్...
నెలకు ₹2,50,000
హోదా: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. జీతం: నెలకు ₹2,50,000. పెన్షన్: సంవత్సరానికి ₹15,00,000 (డియర్‌నెస్ రిలీఫ్‌తో) గ్రాట్యుటీ: ₹20,00,000.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/india-warning-to-pakistan-economic-crisis/international/529920/

: Justice Gavai animal rights India judiciary stray dogs issue Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.