📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ram Rahim: జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ram Rahim: సిర్సా కేంద్రంగా పనిచేసే డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా హైకోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది..

Read Also: Vijayawada Crime: దారుణం: మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

నిర్దోషిగా తేలినా జైలులోనే.. ఎందుకంటే?

అయితే, ఈ కేసులో నిర్దోషిగా తేలినప్పటికీ రామ్ రహీమ్ జైలు నుంచి విడుదల కావడం లేదు. ఆయన మరో అత్యాచారం కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్నందున జైల్లోనే కొనసాగనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, జస్టిస్ విక్రమ్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రామ్ రహీమ్ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను ప‌రిశీలించిన‌ కోర్టు, ఇదే కేసులో దోషులుగా ఉన్న మరో ఇద్దరి అప్పీళ్లను మాత్రం తోసిపుచ్చింది. వారి శిక్షను ధర్మాసనం ఖరారు చేసింది. 

Journalist murder case.. Relief for ‘Dera’ Ram Rahim in the High Court

జర్నలిస్ట్ ఛత్రపతి హత్య జరిగిన 16 ఏళ్ల తర్వాత 2019లో ప్రత్యేక కోర్టు రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ముఖ్యంగా హత్యకు ఉపయోగించినట్లు చెబుతున్న బుల్లెట్లపై నెలకొన్న వివాదాన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ తీర్పును వెలువరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

High Court verdict Journalist Ramchander Chhatrapati Murder Case Ram Rahim

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.