Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం

Read Time:  1 min
Jithendra Singh
Jithendra Singh
FONT SIZE
GET APP

ఎంపి మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి

రాజంపేట : దేశంలో 13,100 మెగావాట్ల సామర్థం కలిగిన 17 అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణం 2032 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు కేంద్ర అణు ఇందన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ (jithendra singh) వెల్లడించారు. రాజ్యసభలో వైసిపి రాజ్యసభ సభ్యుడు మేదా భఘునాథరెడ్డి గురువారం దేశంలో ఆ రియాక్షన్ల నిర్మాణం, దీని వలన పర్యావరణ సమస్యలు పై ప్రశ్నించారు. అందుకు కేంద్ర మంత్రి నిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రావత్భట రాజస్థాన్, గోరఙ్ఞాపూర్ హర్యానా, కూడంకుళం తమిళనాడు, కైగా కర్ణాటక మట్కా మహి బర్స్వారా రాజస్థాన్ లలో వివిధ దశలలో పనులు జడుగుతున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం స్థాపిత అణు విద్యుత్ సామర్థం 8,780 మెగావాట్లు అన్నారు. 203132 నాటికి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపాడు.

Read also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

Jithendra Singh

Construction of 17 nuclear power reactors by 2032

ప్రస్తుతం తమిళనాడులోని కల్పక్కంలో 500 మెగావాట్ల ప్రొటోలైవ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రాజెక్టును ప్రారంభిస్తోందన్నారు. ఫ్రీప్రాజెక్ట్ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రియాక్టర్ల భద్రత పనితీరును సమీక్షించడం, వాటి భద్రత, పనితీరు అత్యాధునిక స్థాయికి పెంచడానికి అవసరమైన అప్గ్రేడ్ చర్యలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్లకు సంబందించి, ఆమోదించిన ప్రకారం పర్యావరణ ప్రధాన అంచనా, నిర్వహించబడుతుందన్నారు. ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతి పొందడానికి సూచించిన ప్రక్రియను అనునదిస్తారన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.