రిలయన్స్ జియో 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన వినియోగదారులకు అదిరిపోయే కానుక ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ (Jio New Year 2026 Plans) పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏంటంటే… కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాకుండా ఆధునిక AI సేవలను కూడా ఉచితంగా అందించడమే. టెక్నాలజీని సామాన్య వినియోగదారుల దగ్గరికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జియో ఈ కొత్త ఆఫర్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Vaibhav Suryavanshi: వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
జెమిని ప్రో ఏఐ యాక్సెస్
రూ.3,599 ‘హీరో యాన్యువల్ ప్లాన్’ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G సేవలతో పాటు 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. రూ.500 ‘సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్’ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, 12 పైగా ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 18 నెలల జెమిని ప్రో ఏఐ యాక్సెస్‌ను అందిస్తుంది. రూ.103 ‘ఫ్లెక్సీ ప్యాక్’ 28 రోజుల పాటు 5GB అదనపు డేటాను అందిస్తుంది.
ప్లాన్లు ఎక్కడ లభిస్తాయి?
ఈ ప్లాన్లు ఎక్కడ లభిస్తాయి? జియో తెచ్చిన ఈ న్యూ ఇయర్ (New Year) 2026 ప్లాన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మీరు జియో అధికారిక వెబ్‌సైట్, మైజియో (MyJio) యాప్ లేదా మీ దగ్గరలోని అధీకృత జియో రిటైల్ స్టోర్లకు వెళ్లి రీఛార్జ్ చేసుకోవచ్చు. టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న వేళ జియో కేవలం డేటానే కాకుండా ఏఐ (AI)తో పాటు ఓటీటీ సేవలను జత చేయడం ద్వారా తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ప్లాన్లు టెక్ ప్రియులకు, సినిమా ప్రేమికులకు పండగే అని చెప్పాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: