జియో కొత్త రీచార్జ్ ప్లాన్: 200 రోజుల సూపర్ చౌక లాంగ్-వాలిడిటీ ఆఫర్
Jio recharge : దేశంలో అతిపెద్ద టెలికాం కస్టమర్ బేస్‌ను కలిగిన రిలయన్స్ జియో, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరుసగా కొత్త రీచార్జ్ ప్లాన్లను విడుదల చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే యూజర్ల కోసం జియో మరో కొత్త చౌక లాంగ్-టర్మ్ ప్లాన్ తీసుకువచ్చింది.
365 రోజుల ఖరీదైన వార్షిక ప్లాన్‌ను కొనాలనుకోని కస్టమర్ల కోసం ప్రత్యామ్నాయంగా రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ ఆమోదయోగ్యమైన ఎంపికగా మారింది. ఈ ప్లాన్‌ను జియో తన బెస్ట్ 5G లాంగ్-వాలిడిటీ ఆఫర్లు జాబితాలో చేర్చింది.
Read Also: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి
ఈ ప్లాన్‌లో ఏముంది?
200 రోజుల సూపర్ లాంగ్ వాలిడిటీ
రూ. 2025 రీచార్జ్‌తో సిమ్ కార్డు 200 రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుంది.
అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్
200 రోజులు ఏ నెట్‌వర్క్‌కైనా పూర్తి అపరిమిత కాల్స్.
మొత్తం 500 GB డేటా (Jio recharge)
ప్లాన్ కాలంలో 500 జీబీ హై-స్పీడ్ డేటా అందుతుంది. రోజుకు 2.5GB వరుకు ఉపయోగించుకోవచ్చు.
5G ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5G డేటా కూడా లభిస్తుంది.
రోజుకు 100 ఉచిత SMSలు
అదనపు బెనిఫిట్స్
జియో రూ. 2025 ప్లాన్‌లో అదనంగా ఇవి కూడా ఉన్నాయి:
- 3 నెలల జియో హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్
- జియో టీవీ యాప్‌కు ఫ్రీ యాక్సెస్
- 50GB Jio AI క్లౌడ్ స్టోరేజ్
కాబట్టి తక్కువ ఖర్చుతోకి ఎక్కువ కాలం యాక్టివిటీ కావాలంటే, ఈ కొత్త జియో ప్లాన్ యూజర్లకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :