Jharkhand Railway Tragedy: జార్ఖండ్ రాష్ట్రం పాకూర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో భార్యాభర్తలతో పాటు వారి మూడేళ్ల కుమార్తె కూడా ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. హౌరా డివిజన్ పరిధిలోని నాగర్నభి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
Read Also: US: భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్
అజాగ్రత్తే ప్రాణాలు తీసిందా?
మృతులను చందన్ సర్దార్ (35), అతని భార్య రింపా (25), కుమార్తె అర్పితగా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురూ రైల్వే పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో వేగంగా వచ్చిన వందే భారత్ రైలు వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. రైలు వేగాన్ని గమనించకపోవడం లేదా పట్టాలు దాటే క్రమంలో అజాగ్రత్తగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: