📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jharkhand Plane Crash: అంబులెన్స్ ప్రమాదం.. డీజీసీఏ కీలక అప్‌డేట్!

Author Icon By Aanusha
Updated: February 24, 2026 • 9:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jharkhand Plane Crash: జార్ఖండ్‌ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్’కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 (VT-AJV) ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న రోగి, వైద్యులు, సిబ్బంది సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 7:11 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

Read also: Social media crime : ఇన్‌స్టా ఫ్రెండ్ పార్టీ పిలుపు, బెంగళూరులో షాకింగ్ కేసు

వాతావరణం అనుకూలంగా లేక

ప్రమాదానికి ముందు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం పైలట్ అనుమతి కోరినట్టు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరాలు వెల్లడించింది. సోమవారం రాత్రి 7:34 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ కోల్‌కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించిందని పేర్కొంది. వాతావరణం సరిగ్గా లేనందున విమానం వెళ్లే మార్గాన్ని మార్చాలని పైలట్ కోరినట్టు తెలిపింది.

Jharkhand Plane Crash: Ambulance accident.. DGCA key update!

అయితే, ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే విమానంతో కమ్యూనికేషన్, రాడార్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని డీజీసీఏ వివరించింది. అనంతరం విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.  

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Chatra Air Ambulance Accident DGCA Statement Jharkhand Plane Crash Ranchi to Delhi Flight

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.