📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Road Accident: ఝార్ఖండ్ లో బస్సు ప్రమాదం..18 మంది మృతి

Author Icon By Ramya
Updated: July 29, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మూర్ఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవఘర్లో మంగళవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. ఈ విషాదఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాబాధామ్ (దేవఘర్) నుంచి బాసుకీనాథ్ వైపుగా కావడి యాత్రికులతో బస్సు మోహనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వస్తున్న ట్రక్కును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. స్పాట్లోనే 18మంది మరణించినట్లు స్థానిక బీజేపీ ఎంపీ నిశాంత్ దూబే (BJP MP Nishant Dubey) తెలిపారు. విషాదఘటనను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఎంపీ తన ప్రాతినిధ్యం వహిస్తున్న దేవఘర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ దుర్గటన జరగడంతో ఎంపీ నిషికాంత్ దూబే ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు. ‘నా లోక్ సభ నియోజకవర్గం అయిన దేవఘర్లో శ్రావణమాసంలో కావడి యాత్రకు (Kavadi pilgrimage) ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ ట్రక్కుని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని.. ఈ ప్రమాదంలో 18 మంది భక్తులు మరణించారు. బాబా బైద్యనాథ్ జీ వారి కుటుంబాలకు ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలి’ అని దూబే పోస్టులో పేర్కొన్నారు.

Road Accident: ఝార్ఖండ్ లో బస్సు ప్రమాదం..18 మంది మృతి

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే..

Road Accident: ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సుభాశ్ తురి కూడా మరణించాడు. ఆయన స్వస్థలం మోహన్పర్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాధితులు గట్టిగా అరుపులు, కేకలు వేశారు. దీనితో స్థానికులు అప్రమత్తమై, గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు
అధికారులకు సాయం చేసారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో బస్సు లో ఒక భాగం పూర్తిగా దెబ్బతినడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషమంగా కొందరి పరిస్థితి కాగా ఈ ప్రమాదంలో గాయపడిన 23 మందిని దుమ్కాలోని సరయ్యహాట్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సహా పలు ఆస్పత్రులు, సీహెచ్సీలకు తరలించారని ఇక్కడి పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. అందుకే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరణించిన వారు బస్సు లో బసుకినాథ్ ఆలయానికి వెళ్తున్నారని అధికారులు చెప్పారు.

ఝార్ఖండ్‌లోని దేవఘర్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఎంత మంది మరణించారు?

ఈ ఘోర రోడ్డుప్రమాదంలో 18 మంది మరణించారు.

ప్రమాదం ఎలా జరిగింది?

బాబాధామ్ నుంచి బాసుకీనాథ్ వైపు కావడి యాత్రికులతో వెళ్తున్న బస్సు, జమునియా ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ట్రక్కును ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nimisha Priya: నిమిష ఉరిశిక్ష రద్దుపై కేంద్రం ఏమన్నదంటే..

Babadham Deoghar Kavadi Yatra latest news Nishikant Dubey Road Accident Telugu News Breaking News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.