Jharkhand Air Ambulance Crash: విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

Read Time:  1 min
Jharkhand Air Ambulance Crash: విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి
FONT SIZE
GET APP

Jharkhand Air Ambulance Crash: జార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాకు చెందిన సంజయ్ కుమార్ (41), ఒక దురదృష్టకర అగ్ని ప్రమాదంలో ఆయన చిక్కుకోవడంతో 65 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే ఆయనను రాంచీలోని దేవ్‌కమల్ ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య ఉన్న సంజయ్‌ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే, రాంచీలో ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం దేశ రాజధాని ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు.

Read Also: HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ బుకింగ్

రోడ్డు మార్గంలో తీసుకెళ్తే రోగి ఇబ్బంది పడతాడని వైద్యులు హెచ్చరించారు. దీంతో కుటుంబం.. ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించాలని నిర్ణయించింది. తమ దగ్గర డబ్బులు లేకపోయినా.. రూ.8 లక్షలు అప్పుచేసి మరీ చార్టర్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. కానీ, దురదృష్టం వారిని వెంటాడింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతికలోపంతో కుప్పకూలి సంజయ్, అతడి భార్య, బంధువు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది మృతిచెందారు. సంజయ్ సోదరుడు అజయ్ మాట్లాడుతూ.. చికిత్స కోసం తమ కుటుంబానికి ఉన్న ఆస్తులు, భూమిని కూడా అమ్మేయాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఢిల్లీలోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స, ఎయిర్ అంబులెన్స్ అద్దె కోసం స్నేహితులు, బంధువులు, శ్రేయాభిలాషుల వద్ద అప్పులు చేశామని చెప్పారు.

Jharkhand Air Ambulance Crash: Fighting against fate.. losing in a plane crash
Jharkhand Air Ambulance Crash: Fighting against fate.. losing in a plane crash

గత సోమవారం చాంద్వాలోని సంజయ్ హోటల్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబం మొత్తానికి అతడి సంపాదనే ఆదారమని తెలిపారు. చికిత్స కొనసాగుతున్నా పురోగతి లేకపోవడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించాలని కుటుంబం నిర్ణయించింది. భార్య అర్చన, బంధువు ధ్రువ్‌, వైద్యుడు, పారామెడికల్ అసెస్టెంట్‌, కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కో-పైలట్ సవర్జీదీప్ సింగ్ సహా ఏడుగురు విమానంలో బయలుదేరారు. కానీ, ఊహించని విధంగా టేకాఫ్ అయిన అర గంటలోనే విమానం ప్రమాదానికి గురైంది. ఒక్కరి ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఏడుగురు అనంతలోకాలకు చేరుకోవడం బాధాకరం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.