📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Jhansi woman auto driver : పెళ్లిరోజే హత్య ఎందుకు? ఝాన్సీ మహిళా ఆటో డ్రైవర్ కేసులో షాక్!

Author Icon By Sai Kiran
Updated: January 10, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jhansi woman auto driver : ఉత్తర్ ప్రదేశ్‌లోని Jhansi జిల్లాలో సంచలనం సృష్టించిన తొలి మహిళా ఆటో డ్రైవర్ అనితా చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే ఈ హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు పోలీసుల చేతికి చిక్కడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల 4వ తేదీ రాత్రి ఝాన్సీలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సకున్వా ధుక్వాన్ కాలనీ వద్ద అనితా చౌదరిని దుండగులు కాల్చి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని, పక్కనే బోల్తా పడిన ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు ముఖేశ్ ఝా, శివం, మనోజ్‌లపై కేసు నమోదు చేశారు.

Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

దర్యాప్తులో భాగంగా శివం, మనోజ్‌లను పోలీసులు (Jhansi woman auto driver) అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడైన ముఖేశ్ ఝా పరారయ్యాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అతడు తన కారును Betwa River పై ఉన్న నోట్‌ఘాట్ వంతెన వద్ద వదిలిపెట్టి పారిపోయినట్లు గుర్తించారు.

శుక్రవారం రాత్రి భగవంతపురం సమీపంలోని మట్టి రోడ్డులో ముఖేశ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఈ సమయంలో అతడు పోలీసులపై కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఎస్పీ (సిటీ) ప్రీతి సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం ముఖేశ్, అనిత ఒకరినొకరు ప్రేమించి గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే కొద్దికాలానికే అనిత అతడిని విడిచిపెట్టింది. దీనిని ద్రోహంగా భావించిన ముఖేశ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. తమ పెళ్లి రోజు అయిన జనవరి 4న ఆమెను హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి ఒక పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anita Chaudhary murder case Betwa river incident Breaking News in Telugu Google News in Telugu India crime breaking news Jhansi police encounter Jhansi woman auto driver murder Latest News in Telugu love betrayal revenge murder murder mystery India Telugu News Uttar Pradesh Crime News woman auto driver killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.