ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి అత్యంత కీలకమైన జేఈఈ మెయిన్ సెషన్–1 (JEE Main 2026) పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.. తాజాగా జనవరి 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read Also: RRBJobs: 312 పోస్టులు.. జనవరి 29 డెడ్‌లైన్
పూర్తి వివరాలు
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, రెండు రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 (JEE Main 2026) పరీక్షలు జరుగుతున్నాయి.
జనవరి 28న పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 29వ తేదీన పేపర్-2ఏ(బీఆర్క్) పేపర్-2బి (బీప్లానింగ్) ఉదయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: