నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main 2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం అధికారికంగా విడుదల చేసింది.పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.ఈ నెల 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పేపర్-1 (బీ.టెక్/బీ.ఇ.) పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఎన్టీఏ ప్రస్తుతం జనవరి 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రమే హాల్ టికెట్లను జారీ చేసింది.
Read Also: Rihan Saha: బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య
ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి
జనవరి 28, 29 తేదీల్లో పరీక్షలు ఉన్నవారికి అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక పేపర్-2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్ష జనవరి 29న జరగనుంది.పరీక్షలు రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని పరీక్షా కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఏవైనా సమస్యలుంటే jeemain.nta.nic.in కు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: