Maharashtra Master Plan: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఈ దీర్ఘకాలిక విజన్‌ను ఆవిష్కరించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, వేగవంతమైన రవాణా మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ, కొత్త వాణిజ్య కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో మహారాష్ట్రను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.
Read Also: Delhi Air Pollution: దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
రూ.36 వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్..
ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ముంబై–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే. దాదాపు రూ.36 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారిని ‘జనకల్యాణ్ ఎక్స్‌ప్రెస్‌వే (Jankalyan Expressway)’గా కూడా పిలుస్తారు. థానే, పుణే, అహల్యానగర్, బీడ్, లాతూర్ జిల్లాల మీదుగా సాగే ఈ 450 కిలోమీటర్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్, ముంబైను హైదరాబాద్‌తో నేరుగా కలుపుతుంది. దీని వల్ల రెండు నగరాల మధ్య దూరం 180 కిలోమీటర్లకు పైగా తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై నుంచి లాతూర్ వరకు ప్రయాణంలో సుమారు నాలుగున్నర గంటల సమయం ఆదా కానుంది. ఈ రహదారి మార్గమధ్యంలోని జిల్లాల ఆర్థిక పురోగతికీ కొత్త ఊపునివ్వనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: