Jammu Kashmir: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణవార్త భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి నిరసనగా జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో షియా సామాజిక వర్గీయులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలోని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది.
Read Also:Iran Attack: అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!
ముఖ్యంగా షియా జనాభా ఎక్కువగా ఉన్న శ్రీనగర్, లక్నో వంటి నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, మతపరమైన ప్రసంగాల ద్వారా ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని, ముఖ్యంగా మత పెద్దల ప్రసంగాలపై నిశితంగా నిఘా ఉంచాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ముందస్తు జాగ్రత్తగా కశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై పాక్షిక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను రంగంలోకి దించారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: