📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Jammu and Kashmir: కశ్మీర్‌లో మూడో రోజూ కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్

Author Icon By Sharanya
Updated: August 3, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ (Operation Akhal) మూడవ రోజుకు చేరింది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మొత్తం మృతుల సంఖ్య ఇప్పటివరకు ఆరుకు చేరినట్టు అధికారులు తెలిపారు. జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడినట్టు సమాచారం. ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని సైనిక ఆసుపత్రికి తరలించారు.

Jammu and Kashmir: కశ్మీర్‌లో మూడో రోజూ కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్

సంయుక్త శోధన చర్యల నేపథ్యంలో ఎదురుకాల్పులు

పక్కా నిఘా సమాచారం మేరకు భద్రతా బలగాలు (జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)పోలీసులు, భారత సైన్యం, CRPF) శుక్రవారం ఈ ప్రాంతంలో కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ (Cordon-and-search operation) ప్రారంభించాయి. అయితే తమను గుర్తించిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయి కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌గా మారింది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాత్రంతా కాల్పుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంలో నేడు మరో ముగ్గురిని హతమార్చాయి.

లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌కు చెందిన ఉగ్రవాదులు

నిన్న హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)కు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఈ సంస్థ 2025లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరుల హత్యకు బాధ్యత వహించింది. ఈ ఆపరేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భద్రతా యంత్రాంగం అత్యాధునిక నిఘా పరికరాలు, ప్రత్యేక బలగాలు, మరియు డ్రోన్లు వాడుతూ ఉగ్రవాదుల సంచారంపై పట్టు సాధిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dharmasthala-bone-mystery-sit-probe/crime/525136/

Breaking News jammu kashmir Kashmir Gunfight Kulgam Encounter Lashkar e Taiba latest news Operation Akhal Telugu News Terrorists Killed TRF Militants

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.