📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఇండీ కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం విమర్శలు

Author Icon By Sudheer
Updated: February 8, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటున్న వేళ, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రామాయణం సీరియల్‌కు సంబంధించిన ఓ జిఫ్‌ను షేర్ చేసిన ఆయన “జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి, ఒకరినొకరు అంతం చేసుకోండి” అనే సందేశంతో కాంగ్రెస్-ఆప్ పార్టీల మధ్య ఉన్న విభేదాలను ఉద్దేశించి విమర్శించారు.

ఇండియా కూటమి స్థాపన సమయంలో బీజేపీకి బదిలీగా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒకటై పనిచేయాలని నిర్ణయించుకున్నా, గ్రౌండ్ లెవల్‌లో ఆ సంగతులు కనిపించకపోవడం విస్మయకరంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయడం లేదు. ఒకే కూటమిలో ఉన్నా, సీట్ల పంపిణీ విషయంలో మళ్లీ పోటీ స్థాయిలోనే వ్యవహరించాయి. ఇదే కారణంగా ప్రజలు ఆ పార్టీలు పట్ల విశ్వాసం కోల్పోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఇండీ కూటమిలో ఉన్న విభేదాలను మళ్లీ హైలైట్ చేశాయి. ప్రతిపక్ష కూటమిగా బీజేపీని ఎదుర్కొనాలనుకున్న పార్టీల మధ్య అసలు ఐక్యత లేదని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కూడా, కూటమిలో లేని ఏకత్వం వల్లే ఓటమిని మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియా కూటమిలో సమన్వయం లేకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్-ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడి బీజేపీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తే, ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఇండీ నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. మొత్తంగా ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల విబేధాలను మరింత తెరమీదకు తెచ్చాయి.

Delhi Election Results Google news India alliance Jammu and Kashmir chief minister Omar Abdullah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.