📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Jammu Kashmir: మంచులో చిక్కుకున్న 12 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

Author Icon By Saritha
Updated: January 23, 2026 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
A rescue team saved 12 people who were trapped in the snow.

జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) ఉధంపూర్ జిల్లాలో(Udhampur) భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 12 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చోచ్రు గల్లా ప్రాంతంలో కొందరు స్థానికులు మంచులో చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

Read Also: Tirupati : స్వామి దర్శనంలో సమానత్వం సాధ్యమేనా?

మూడు గంటల పాటు శ్రమించి కాపాడిన ఉధంపూర్ పోలీసులు

చోచ్రు గల్లా ప్రాంతానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘ్ పోలీస్ పోస్టుకు అత్యవసర సహాయం కోసం ఫోన్ కాల్ వచ్చింది. (Jammu and Kashmir) వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనా స్థలానికి బయలుదేరారు. దట్టమైన మంచు, క్లిష్టమైన మార్గంలో సుమారు మూడు గంటల పాటు ప్రయాణించి, చిక్కుకుపోయిన వారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు వృద్ధులను చేతులు పట్టుకుని సురక్షితంగా నడిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైనట్లు ఉధంపూర్ పోలీసులు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. బసంత్‌గఢ్ ఎగువ ప్రాంతాలలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన 12 మందిని ఉధంపూర్ పోలీసులు విజయవంతంగా రక్షించారు అని పోస్ట్ చేశారు. బాధితులందరినీ పోలీస్ పోస్టుకు తరలించి, వారికి ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందించారు.

మరోవైపు భారీ హిమపాతం, వర్షాల కారణంగా ఉధంపూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. శ్రీనగర్‌లో కూడా ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



heavy snowfall Jammu And Kashmir Latest News in Telugu police rescue Rescue Operation Snowfall Telugu News Udhampur Weather Alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.