📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Jaishankar:స్వేచ్ఛా హక్కులపై ఐరాస సూచన.. భారత్‌ స్పందన

Author Icon By Sushmitha
Updated: October 24, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైనారిటీల రక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ,(freedom,) మీడియా స్వేచ్ఛా హక్కులను కాపాడేందుకు భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న స్విట్జర్లాండ్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) గట్టిగా స్పందించారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఐరాస నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించలేవని స్పష్టం చేశారు.

Read Also: Afghanistan: కాబుల్‌ న‌దిపై డ్యామ్‌ల నిర్మాణం

ఐరాసలో సంస్కరణలు అవసరం: జైశంకర్

ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపు విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాల యుగంలో శాంతి అవశ్యమని జైశంకర్ అన్నారు. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్యసమితిలో అంతా సరిగా లేదని, ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో మార్పులు జరిగేలా సంస్కరణలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

స్విట్జర్లాండ్ అంతర్గత సవాళ్లను ప్రస్తావించిన మంత్రి

ఐక్యరాజ్యసమితికి భారత్ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగానే ఉంటుందని, అలాగే కొనసాగుతుందని మంత్రి జైశంకర్ తెలిపారు. కానీ ఐక్యరాజ్యసమితి(United Nations) నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించవని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, జాత్యాహంకారం, వివక్ష, విదేశీయులపై విద్వేషం వంటి అంతర్గత సవాళ్లను స్విట్జర్లాండ్ ఎదుర్కొంటున్న సంగతిని ఆయన ప్రస్తావించారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఏ దేశానికి చెందినవారు?

స్విట్జర్లాండ్‌కు చెందినవారు.

ఐరాసపై జైశంకర్ చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించడం లేదని ఆయన విమర్శించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Freedom of Speech Google News in Telugu Indian foreign policy international relations. Latest News in Telugu S Jaishankar Switzerland Telugu News Today UN Human Rights Commission UN reforms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.