📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Congress: గాంధీని మర్చిపోయేలా చేస్తున్న ప్రధాని మోదీ: జైరాం రమేశ్

Author Icon By Vanipushpa
Updated: January 23, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీని దేశంలోనే ‘అత్యంత గొప్ప చరిత్ర వక్రీకారుడు’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన ప్రధానిపై అనేక విమర్శలు ేచశారు. గత నెలలో పార్లమెంటు వేదికగా ‘వందేమాతరం’ గీతంపై జరిగిన చర్చలో మోదీ చరిత్రను వక్రీకరించారని, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకాలను, వారసత్వాన్ని మోదీ తుడిచిపెట్టేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Srinagar: భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు

Congress: గాంధీని మర్చిపోయేలా చేస్తున్న ప్రధాని మోదీ: జైరాం రమేశ్

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ ప్రతిష్ఠను దెబ్బతీశారు

జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. “గత నెలలో పార్లమెంటులో జాతీయ గేయంపై చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన సహచరులు వాస్తవాలను వక్రీకరించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారు. కానీ చివరికి వారి బండారం బయటపడింది. ప్రధాని ఉద్దేశపూర్వకంగానే చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే ఆయన దేశంలోనే ‘గ్రేటెస్ట్ డిస్టోరియన్’ (చరిత్రను వక్రీకరించేవాడు)” అని జైరాం రమేశ్ ఘాటుగా విమర్శించారు. నేతాజీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేశ్ కొన్ని చారిత్రక అంశాలను ప్రస్తావించారు. “1937లో వందేమాతరం గీతంలోని తర్వాతి చరణాలపై ఒక వివాదం నడిచింది. ఆ వివాదాన్ని పరిష్కరించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. కానీ పార్లమెంటు చర్చలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. ప్రజలకు నిజాలు తెలియకుండా చేశారు” అని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BJP politics congress party freedom movement legacy Gandhi ideology Indian Politics Jairam Ramesh MahatMa Gandhi Narendra Modi political criticism Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.