📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Jaipur: డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవసరంలో ఉన్నా అతివేగం పనికి రాదని పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. విచక్షణ కోల్పోయి వాహనం నడిపితే మీతో పాటు ఎలాంటి తప్పు చేయని అవతలి వాళ్లను కూడా ఇబ్బందులో పడేస్తారు. తాజాగా ఇటువంటి దారుణం రాజస్థాన్‌లో జరిగింది. (Jaipur) వేగంగా వస్తున్న ఓ టాక్సీ రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కూరగాయల వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి కారణమైన సదరు కారు మూడు బైక్‌లు, ఒక లోడింగ్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Telangana Municipal Winners: ఒకే ఇంట్లో రెండు పదవులు.. డబుల్ ధమాకా!

గోపాల్‌పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న టాక్సీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ప్రమాద సమయంలో కారు గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. (Jaipur) ఈ ఘటనలో అదే ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం(Vegetable business) చేసుకునే మహవా మండవర్ నివాసి మహేష్ సైని (50) మృతి చెందాడు. మృతుడు బజాజ్ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహావీర్ నగర్ ప్రాంతంలో లోడింగ్ వాహనంలో కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం కూడా మహేష్ రోడ్డు పక్కన కూరగాయల బండిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అతని ప్రాణాలను బలి తీసుకుంది. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. కారు డ్రైవర్ జస్వీర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Fatal Accident Hit and Run Case Jaipur Latest News in Telugu Rajasthan Road Accident Speeding Taxi Telugu News Vegetable Vendor Death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.