📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Dhankhar: జగదీప్‌ ధన్‌ఖడ్‌ అదృశ్యం.. అమిత్‌ షాకు శివసేన లేఖ

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఉపరాష్ట్ర(Vice President) పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌(jagdeep-dhankhar)రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లో తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. అయినప్పటికీ విపక్ష పార్టీల నేతలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ బయట కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన (UBT) సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amithsha)కు లేఖ రాశారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలవలేకపోతున్నామని.. ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు. ” మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు.

Dhankhar: జగదీప్‌ ధన్‌ఖడ్‌ అదృశ్యం.. అమిత్‌ షాకు శివసేన లేఖ

ధన్‌ఖడ్‌కు అసలేం జరిగింది?
ఆయన ఎక్కడున్నారు ? ఆరోగ్యం ఎలా ఉంది అనే దానిపై క్లారిటీ లేదు. ఆయనతో మాట్లాడేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరికీ ఆయన సిబ్బందిని కూడా కలవలేకపోతున్నాం. దీనిపై ఆందోళనగా ఉంది. ధన్‌ఖడ్‌కు అసలేం జరిగింది ? ఆయన క్షేమంగానే ఉన్నారా అనేది దేశ ప్రజలకు తెలియాల్సి ఉందని” సంజయ్ రౌత్‌ తన లేఖలో రాసుకొచ్చారు. ఈ ఉత్తరాన్ని రౌత్ ఆదివారమే పంపించారు. సోమవారం ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు.
సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్?
జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు కూడా సంజయ్ రౌత్‌ చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లేముందు అమిత్‌ షా నుంచి సమాచారం కోరడం ఉత్తమమని అనుకున్నట్లు తెలిపారు. మా ఆందోళనలు అర్థం చేసుకొని ధన్‌ఖడ్‌ ఆచూకీ చెబుతారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పలువురు విపక్ష నేతలు సైతం జగదీప్‌ ధన్‌ఖడ్‌ సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా
ఇదిలా జైల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల మొదటి రోజునే జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆరోజు ఉదయం ఆయన రాజ్యసభలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం నాటికి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కానీ విపక్ష నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండించారు. నోట్ల కట్టల కేసు విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో ధన్‌ఖడ్‌కు కేంద్రంపై విభేదాలు వచ్చాయని.. అందుకే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఎపుడు రాజీనామా చేసారు?

21 జూలై 2025న, ధంఖర్ ఆరోగ్య సమస్యల కారణంగా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. [ 5 ] పదవీకాలం మధ్యలో రాజీనామా చేసిన మొదటి ఉపాధ్యక్షుడు ఆయన.

ఎపుడు భారత ఉపాధ్యక్షుడు గెలిచారు?

జూలై 2022లో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 2022 ఎన్నికలకు ధంఖర్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది మరియు చివరికి ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/aus-vs-sa-team-david-creates-history/international/528714/

Amit Shah India News Jagdeep Dhankhar Maharashtra Politics Shiv Sena Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.