📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

బెంగళూరులో సామాన్యులకు గడ్డుకాలమే!

Author Icon By Vanipushpa
Updated: January 28, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా మన తెలుగోళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ప్రస్తుతం సామాన్య ప్రజలు నివసించటానికి అందుబాటులో లేని నగరంగా మారిపోయింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమకు చెందిన ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ నగరంలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో టెక్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అధిక వేతనాలు అందుకుంటున్న టెక్కీలు బెంగళూరులో ఇంటి యజమానులు అడుగుతున్న భారీ అద్దెలకు అంగీకరించటంతో నగరంలో రెంట్స్ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంటి యజమానులు సైతం ఇష్టమెుచ్చినట్లు అద్దెలు అడగటం దానికి ఐటీ ఉద్యోగులు కూడా సానుకూలంగా ఉండటంతో అద్దెలు పెరుగుతూ పోతున్నాయని ఒక వ్యక్తి రెడిట్ ఫ్లాట్ ఫారమ్‌లో పోస్ట్ చేయటం వైరల్ అయ్యింది.

అయితే బెంగళూరు నగరంలో భారీగా అద్దెలు పెరగటంపై రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాట్లాడుతూ.. ఐటీ కారిడార్ సమీపంలో ఉద్యోగులకు సరసమైన అద్దెలకు ఇళ్లు అందుబాటులో లేకపోవటంతో నగరంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా అద్దెలు పెరుగుదలకు కారణంగా చెపుతున్నారు. నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు సంపాదిస్తున్న టెక్కీల నుంచి ఇంటి యజమానులు అద్దె రూపంలో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. దీని కారణంగా మెుత్తం నగరంలో అద్దెలు తారా స్థాయిలకు చేరుకుంటున్నాయని.. సాధారణ ఉద్యోగాలు చేస్తున్న ఆదాయ వర్గాలకు ఇది భరించలేని భారంగా మారిపోయిందని పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసేదేం లేక ఐటీ ఉద్యోగుల వల్ల పెరిగిన అద్దెలతో తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఎక్కువ అద్దెలకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపాడు.

Bangalore city common man rents went on high tough time

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.