ప్రముఖ రెస్టారెంట్లలో ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్ (Money laundering) వంటి ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు (IT Raid) నిర్వహిస్తున్నది. పిస్తా హౌస్,(Pista House) షాగౌస్, మెహిఫిల్ హోటల్స్,(Mehfil Hotels) రెస్టారెంట్లలో గత రెండురోజులుగా సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడుకూడా సోదాలు కొనసాగనున్నాయి. దాదాపు 20కోట్ల నగదు, భారీగా బంగారం ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు
పలు చోట్ల కొనసాగుతున్న సోదాలు
రాజేంద్రనగర్ (Rajendranagar) గోల్డెన్ హైట్స్ కాలనీలో పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లతో పాటు షాగౌస్, మెయిల్ చైర్మన్లు, డైరెక్టరల ఇళ్లలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. లక్షీకాపూల్, షేక్ పేట్, అత్తాపూర్, టోలీచైకి, గచ్చిబౌలి సహా గ్రేటర్ హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో రెండు రోజులుగా సోదాలు జరుగుతున్నాయి.
దాదాపు 20కోట్ల నగదు, భారీగా బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. వీటితోపాటు వర్కర్ల పేర్లతో ఉన్న బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు సహా కీలక పత్రాలు, పలువురి పేరున బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. బ్లాక్ మనీని హవాలా రూపంలో దారిమళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు కాగా నేడు కూడా సోదాలు కొనసాగనున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: