📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

IT hiring 2026 : లేఆఫ్‌ల తర్వాత ఊహించని మార్పు ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయా?

Author Icon By Sai Kiran
Updated: January 19, 2026 • 7:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IT hiring 2026 : ఐటీ రంగానికి ఈ ఏడాది ఊతం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా లేఆఫ్‌లతో ఆందోళన నెలకొన్నప్పటికీ, 2026లో టెక్ నియామకాలు మళ్లీ వేగం పుంజుకోనున్నట్లు Adecco India వెల్లడించింది. 2025తో పోలిస్తే ఈ ఏడాది టెక్ ఉద్యోగాలు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు ప్రాతిపదికన జరిగే నియామకాల ద్వారా దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది.

ఏఐ ప్రవేశంతో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా గతంలో పెద్ద కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు పాల్పడ్డాయి. అయితే ప్రస్తుతం సంస్థలు (IT hiring 2026) తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఈ మార్పులే టెక్ నియామకాలకు కొత్త దారులు తెరుస్తున్నాయని అడెకో ఇండియా పేర్కొంది.

Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఈ అంశంపై అడెకో ఇండియా డైరెక్టర్, బిజినెస్ హెడ్ Sanket మాట్లాడుతూ—2023–24 మధ్య నెలకొన్న అనిశ్చితి అనంతరం ఏఐ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ వంటి విభాగాల్లో డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నారు. కంపెనీలు పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తూ, కొత్త నియామక ప్రక్రియలను ప్రారంభిస్తున్నాయని తెలిపారు.

51 శాతం పెరిగిన డిమాండ్

ప్రస్తుతం ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలు సంస్థలకు అత్యవసరంగా మారాయి. ఈ విభాగాల్లో డిమాండ్ 51 శాతం పెరిగిందని అడెకో ఇండియా వెల్లడించింది. దాదాపు 40 శాతం పెద్ద సంస్థలు ఇప్పటికే జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు సైబర్ సెక్యూరిటీపై ఎక్కువ దృష్టి పెట్టగా, నాన్-టెక్ రంగాలు కూడా ఆటోమేషన్ కోసం భారీగా టెక్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి.

అయితే ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, అవసరమైన నైపుణ్యాలున్న అభ్యర్థుల కొరత కొనసాగుతోంది. 2025 నాటికి స్కిల్ గ్యాప్ 44 శాతానికి చేరినట్లు అంచనా. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ రంగాల్లో 45 శాతం నైపుణ్య లోటు ఉంది. దీనివల్ల స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ పెరిగి, వేతనాలు 2024తో పోలిస్తే సగటున 18 శాతం పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల్లో టెక్ ఆధారిత నియామకాలు పెరగనున్నాయని, ఈ రంగాల వాటా మొత్తం టెక్ ఉద్యోగాల్లో 38 శాతం ఉంటుందని అడెకో ఇండియా తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Adecco India report AI jobs demand Breaking News in Telugu cloud transformation roles cybersecurity hiring data engineering jobs generative AI jobs Google News in Telugu IT hiring 2026 IT jobs growth India IT layoffs recovery IT salary hike Latest News in Telugu tech jobs increase tech workforce India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.