📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Isro Apprentice : ఇస్రోలో 410 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Author Icon By Vanipushpa
Updated: July 31, 2026 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Isro Apprentice : ఇస్రో 410 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (URSC)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి వీటిని నింపనున్నారు. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (NATS) పోర్టల్‌లో ఆగస్టు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తమ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవాలి.

Read Also: ILO Praises India: భారత్‌లో కొత్త చరిత్ర: 101 కోట్ల మందికి సామాజిక భద్రత

Isro Apprentice

ఖాళీలు
మూడు విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవి.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 220, టెక్నికల్‌ అప్రెంటిస్‌ 120, కమర్షియల్‌ అప్రెంటిస్‌ 70 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో అర్హతకు సంబంధించిన విద్యను పూర్తి చేసినవారే దరఖాస్తు చేసుకోవాలి.

Isro Apprentice : దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు ముందుగా NATS (నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. తరువాత ఉమంగ్‌ (UMANG) పోర్టల్‌లో యూఆర్‌ఎస్‌సీ అప్రెంటిస్‌షిప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో NATSలో వచ్చిన ఎన్‌రోల్‌మెంట్‌/అప్రెంటిస్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేయాలి. అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఎంపికైనవారికి నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ. 12,300, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ. 10,900, కమర్షియల్‌ అప్రెంటిస్‌లకు రూ. 10,900 స్టైపెండ్‌గా ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 28. దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ https://nats.education.gov.inలో చూడవచ్చు. ఉమంగ్‌ పోర్టల్‌ https://web.umang.gov.in/landing/

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

diploma graduate apprentice isro Google News in Telugu indian space research organisation careers isro 410 apprentice vacancies isro apprentice recruitment ISRO Job Notification latest govt jobs news telugu latest india news Telugu News Today trade apprentice isro Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.