ఇజ్రాయెల్ హమాస్ లమధ్య రెండేళ్లుగా కొనసాగిన యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చొరవతో యుద్ధం ఆగిపోయింది. రెండుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా తమతమ బందీలను విడిపించుకున్నారు. అక్టోబరు 11 నుంచి రెండు దేశాలమధ్య కాల్పు ఒప్పందం జరిగింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండడం లేదు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. గురువారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ చేసిన బాంబుదాడుల్లో 33మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకటించింది. సీజ్ పైర్ తర్వాత ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 211 మంది మరణించగా, 597 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం కేవలం పేరుకే ఉందని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Sabarimala: శబరిమల భక్తుల రద్దీ పెరగడంతో ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం
గాజా, ఖాన్ యూనిస్ నగరాలే లక్ష్యంగా దాడులు
అల్ జజీరా వార్తా సంస్థ ప్రకారం ఇజ్రాయెల్ రాత్రివేళల్లో గాజా,(Gaza) ఖాన్ యూనిస్ నగరాలను లక్ష్యంగా చేసుకుని భారీస్థాయిలో వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 25మంది మరణించగా, 77మందికి పైగా గాయపడ్డారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాసప్రాంతాలను, మారెట్లను, శరణార్థి బస్తీలను టార్గెట్ చేసుకొని ఐడిఎఫ్ దాడులు జరపడంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అల్ జజీరా వెల్లడించింది.
హమాస్ తీవ్రవాదులపై మా దాడులు: ఇజ్రాయెల్
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ (Israel) మాత్రం తమ దాడులు హమాస్ తీవ్రవాదుల మౌలిక వసతులపైనే జరిపినవని ప్రకటించింది. గాజా నుంచి మా భూభాగంపై మళ్లీ దాడులు జరగకుండా ముందస్తు చర్యలు తప్పవని ఐడీఎఫ్ పేర్కొంది. గాజా మాత్రమే కాంకుండా, సరిహద్దు దేశమైన లెబనాన్
లోని పాలస్తీనా శరణార్ధి శిబిరాలపై కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్యశాఖ ధృవీకరించిందని అల్ జజీరా నివేదించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: