📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ambassador Reuven Azar: ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

Author Icon By Vanipushpa
Updated: March 16, 2026 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రిలో ఇజ్రాయెల్ టూర్‌కు వెళ్లి వ‌చ్చిన రెండు రోజులుకే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న ముగిసిన కొన్ని గంట‌ల్లోనే ఇరాన్‌పై అటాక్ జ‌ర‌గ‌డం ప‌ట్ల భిన్న‌మైన క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లోని ఇజ్రాయెల్ అంబాసిడ‌ర్ రూవెన్ అజ‌ర్(Ambassador Reuven Azar) క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లారు. ప్ర‌ధాని మోదీ చేప‌ట్టిన ఉన్న‌త స్థాయి దౌత్య ప‌ర్య‌ట‌న‌కు ముందే.. ప్రాంతీయంగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న‌ట్లు అజ‌ర్ వెల్ల‌డించారు.

Read Also: AIIMS Rajkot Tragedy: రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

Ambassador Reuven Azar: As soon as Prime Minister Modi leaves… an attack on Iran

మోదీ టూర్‌తో సంబంధం లేకుండా..

ప్ర‌ధాని మోదీ ఫిబ్ర‌వ‌రి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించారు. అయితే ఆ స‌మ‌యం క‌న్నా ముందే.. త‌మ ప్రాంతంలో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు అంద‌రికీ తెలిసిందే అని అజ‌ర్ అన్నారు. మోదీ టూర్‌తో సంబంధం లేకుండా.. సైనిక ఆదేశాల ప్ర‌కారం దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. వ్యూహాత్మ‌క అంచ‌నాలు వేసిన త‌ర్వాతే ఇరాన్‌పై అమెరికాతో క‌లిసి దాడికి దిగిన‌ట్లు అంబాసిడ‌ర్ రూవెన్ అజ‌ర్ చెప్పారు. దాడి అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే, ప్ర‌ధాని మోదీ వ‌చ్చి వెళ్లిన త‌ర్వాతే మిలిట‌రీ ఆప‌రేష‌న్ చేప‌ట్టే అవకాశం వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. ఇరాన్‌పై దాడికి, మోదీ ట్రిప్‌కు లింకు ఉన్న‌ట్లు వ‌స్తున్న ఊహాగానాల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. త‌మ ప్రాంతం నుంచి మోదీ వెళ్లిపోయిన త‌ర్వాతే దాడి చేసేందుకు అనుమ‌తి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

.Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran-Israel Conflict Israel Ambassador to India Israeli air strikes on Iran Middle East war updates PM Modi Israel Visit Reuven Azar Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.