అహ్మదాబాద్ మేఘానీనగర్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘోర ప్రమాదం తీవ్రతకు గల కారణాలపై నిపుణులు పరిశీలన చేస్తున్నారు. టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాల్లోనే విమానం కూలిపోవడం, దాంతో జరిగిన పేలుడు, మంటలు ఇలా అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫ్యూయెల్ ప్రధాన పాత్ర వహించినట్లు అంచనా వేస్తున్నారు.
58,000 లీటర్ల ఫ్యూయెల్ కారణంగా భారీ పేలుడు
విమానంలో లండన్ ప్రయాణం కోసం ముందస్తుగా భారీగా ఇంధనం (Fuel) నింపారు. సమాచారం ప్రకారం, దాదాపు 58వేల లీటర్ల జెట్ ఫ్యూయెల్ ట్యాంకులో ఉండగా, కూలిన వెంటనే అది పేలి మంటలు చెలరేగాయి. ఈ పేలుడు వల్ల విమానం పూర్తిగా ధ్వంసమైంది. ముందు భాగం బూడిదగా మారడంతోపాటు, చుట్టుపక్కల ఉన్న భవనాలు, చెట్లు కూడా మంటలకు గురయ్యాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిపుణులు ఇంధనం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని తేల్చుతున్నారు.
జనాభా కలిగిన ప్రాంతంలో ల్యాండింగ్ కష్టమే
విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించారు. కానీ మేఘానీనగర్ పరిసర ప్రాంతాలు అత్యంత జనసాంద్రత కలిగినవి కావడంతో, సరైన ల్యాండింగ్ స్థలాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. మధ్యలో చెట్లు, భవనాలు రావడంతో విమానం కంట్రోల్ కోల్పోయి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు ఇది కూడా ఓ ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇది విమాన భద్రతా ప్రమాణాల పునర్మూల్యాంకనం అవసరమని సూచిస్తోంది.
Read Also : Top 10 Flight Accidents : వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు