📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India : మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 8:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహంగా ఉన్న భారత్, ఇప్పటికే పలు దౌత్య చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. 2021 ఫిబ్రవరి 24న అమల్లోకి వచ్చిన భారత్–పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్రం యోచనలో ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే, సరిహద్దుల్లో భారత సైన్యానికి మరింత స్వేచ్ఛ కలగనుంది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదిక

ఇటీవల కాలంలో పాకిస్థాన్ ఆర్మీ తరచూ కాల్పులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదికలు వెల్లడించాయి. అలాగే, ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో ఒప్పందాన్ని కొనసాగించడం మన జవాన్లకు అడ్డంకిగా మారుతుందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, భారత్ సైనిక బలగాలకు కౌంటర్ చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించాలనే నిర్ణయానికి రావచ్చు.

దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం

ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. భారత్ తీసుకునే ఈ చర్య అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారనుంది. దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం అనే సందేశంతో కేంద్రం ఈ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లతో భారత్ తన స్థైర్యాన్ని ఇప్పటికే చాటిందని విశ్లేషకులు గుర్తిస్తున్నారు. తాజా నిర్ణయం కూడా అదే రీతిలో కఠినమైన విధానానికి సంకేతమని భావిస్తున్నారు.

Another sensational decision Google News in Telugu Ind Pak war modi Pakistan suspends 1972 Simla Agreement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.