📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Irfan Pathan: నా కెరీర్ ధోనీ వల్లే నాశనం అయ్యింది: ఇర్ఫాన్

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన క్రికెట్‌ కెరీర్‌ ముగింపుకు గల కారణాలపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు భారత జట్టులో కీలక పేస్‌ ఆల్‌రౌండర్‌గా వెలుగొందిన ఇర్ఫాన్‌ 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, తన స్వింగ్ బౌలింగ్‌తోనే కాదు, కీలక సందర్భాల్లో బ్యాటింగ్‌తోనూ జట్టుకు సేవలందించాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలోనూ సత్తా చాటిన ఇర్ఫాన్, భారత క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్‌గా గుర్తింపు పొందాడు.అయితే, 2009 తర్వాత ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కెరీర్‌ అనూహ్యంగా పడిపోయింది. నిరంతరం మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ, జట్టులో స్థానం దక్కకపోవడం అతని అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2012 అక్టోబర్‌లో ఆడిన అతను, ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. చివరికి 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్‌ క్షీణతకు గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కారణంగానే తన కెరీర్‌ ముందుకు సాగలేదని, మళ్లీ జట్టులోకి రావడానికి అవకాశం లభించలేదని ఆయన తెలిపారు. అప్పుడు భారత జట్టుకు కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పారని వెల్లడించాడు.కెప్టెన్‌గా తుది జట్టును ఎంచుకునే హక్కు ధోనీకి ఉందని, అతన్ని తాను తప్పుబట్టడం లేదని స్పష్టం చేశాడు.శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో నా అన్న యూసఫ్ పఠాన్‌తో కలిసి నేను అద్భుతమైన విజయాన్ని అందించా. కేవలం 27-28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన తర్వాత కూడా నన్ను ఏడాది పట్టు పక్కనపెట్టారు. ఆ సిరీస్‌ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.

Irfan Pathan

తుది జట్టు ఎంపిక తుది నిర్ణయం కెప్టెన్‌దే

ఈ విషయం గురించి నేను అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను అడిగాను. నన్ను పక్కనపెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్నించాను. కిర్‌స్టెన్‌ నాకు రెండు కారణాలు చెప్పారు. కొన్ని విషయాలు నా చేతుల్లో లేవని చెప్పిన ఆయన, తుది జట్టు ఎంపిక తుది నిర్ణయం కెప్టెన్‌దే అని వెల్లడించాడు. అప్పుడు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు.రెండో కారణంగా.. ఏడో స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కావాలని జట్టు భావిస్తుందని తెలిపాడు. నా సోదరుడు యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. నేను బౌలింగ్ ఆల్‌రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు. తుది జట్టు ఎంపికలో కెప్టెన్‌‌దే తుది నిర్ణయం. ఇక ధోనీ తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా? నేను చెప్పాలనుకోవడం లేదు.’అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

ఇర్ఫాన్ పఠాన్ ఎప్పుడు భారత జట్టులో అరంగేట్రం చేశారు?

ఇర్ఫాన్ పఠాన్ 2003 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్‌లో సాధించిన ముఖ్యమైన రికార్డులు ఏమిటి?

2006లో పాకిస్తాన్‌పై టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఏకైక భారత బౌలర్‌. అలాగే 2007 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ravi-shastri-virat-kohli-is-the-best-captain-i-have-seen/national/530655/

Breaking News career controversy dhoni selection decisions Indian Cricket irfan pathan irfan pathan retirement latest news MS Dhoni Team India Captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.