తెలుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి (IRCTC Offer) ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. భవ్య గుజరాత్(Gujarat) ప్యాకేజ్ (9 రాత్రులు/10 రోజులు) పేరుతో భారత్ గౌరవ్ పర్యాటక రైలు రేణిగుంట నుండి ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరనుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారక, సోమనాథ్(Somnath), అహ్మదాబాద్(Ahmedabad), ఎకతా నగర్(Ekata Nagar) వంటి భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంది. యాత్ర మొత్తం కాలం భోజనం, వసతి, రవాణా సౌకర్యాలతో సహా ఐఆర్‌సిటిసి పూర్తి బాధ్యత తీసుకుంటుంది.
Read also: Shubhman Gill: రోహిత్‌ను పలికరించిన గిల్
ప్రయాణ వివరాలు & మార్గం
IRCTC Offer: రేణిగుంట నుండి బయలుదేరిన రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణా జంక్షన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.
ప్రధాన సందర్శన స్థలాలు:
- ద్వారకా: ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకా
- సోమనాథ్: సోమనాథ్ జ్యోతిర్లింగం ఆలయం
- అహ్మదాబాద్: సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం, రాణి కి వావ్ (పటాన్)
- ఎకతా నగర్: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
రైలు చేరుకునే సమయాలు:
- సికింద్రాబాద్: ఉదయం 8:00 గంటలకు
- నిజామాబాద్: ఉదయం 11:30 గంటలకు
- నాందేడ్: మధ్యాహ్నం 2:00 గంటలకు
- పూర్ణా జంక్షన్: మధ్యాహ్నం 2:50 గంటలకు
ప్యాకేజ్ ధరలు & సౌకర్యాలు
- ఎకానమీ(SL): ₹18,400
- స్టాండర్డ్(3AC): ₹30,200
- కంఫర్ట్ (2AC): ₹39,900
సౌకర్యాలు:
- రోజుకు మూడు భోజనాలు (Breakfast, Lunch, Dinner)
- వసతి, రవాణా సదుపాయం
- ప్రతి బోగీలో IRCTC సిబ్బంది సహాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అపూర్వ యాత్రా అవకాశాన్ని వినియోగించుకోవాలని ఐఆర్‌సిటిసి సూచిస్తోంది.
మరిన్ని వివరాలకు 👉
🌐 Website: www.irctctourism.com
📞 Contact: 9701360701 / 9281030749 / 9281030750 / 9281495843
రైలు ఎక్కడి నుండి బయలుదేరుతుంది?
రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది.
ప్యాకేజీ లో ఏమి అందిస్తారు?
వసతి, భోజనం, రవాణా, టూర్ గైడ్ సేవలు అందిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: